బార్డర్​లో బలగాల ఉపసంహరణ పూర్తి

బార్డర్​లో బలగాల ఉపసంహరణ పూర్తి
  • ఇయ్యాల స్వీట్లు పంచుకోనున్న భారత, చైనా సోల్జర్లు

న్యూఢిల్లీ : ఇండియా, చైనా బార్డర్ లో శాంతి స్థాపనకు ఇరు దేశాల సైనికులు కసరత్తు మొదలుపెట్టారు. ఇరు దేశాల మధ్య ఇటీవల కుదిరిన ఒప్పందం మేరకు త్వరలో పెట్రోలింగ్ ప్రారంభించనున్నారు. ఒప్పందంలో భాగంగా తూర్పు లడఖ్​లోని డెప్సాంగ్, డెమ్​చొక్ రీజియన్లలో ఇప్పటి వరకు మొహరించిన బలగాలను ఇరు దేశాల అధికారులు ఉపసంహరించుకున్నారు. ఆయా బలగాలను వెనక్కి పిలిపించారు.

డెప్సాంగ్, డెమ్​చొక్ రీజియన్లలో ఏర్పాటు చేసుకున్న గుడారాలు, క్యాంపులను చైనా తొలగించింది. వెహికల్స్ ను​ కూడా అక్కడి నుంచి తిరిగి తీసుకెళ్లిపోయింది. శాటిలైట్ ఫొటోల్లో ఇవి స్పష్టంగా కనిపిస్తున్నాయి. బలగాల ఉపసంహరణ ప్రక్రియ బుధవారం నాడు పూర్తయింది. కాగా, దీపావళి నేపథ్యంలో గురువారం బార్డర్ లో భారత్, చైనా సోల్జర్లు స్వీట్లు పంచుకుంటారని ఆర్మీ వర్గాలు తెలిపాయి. మరోవైపు, ఇండియా, చైనా చాలా కీలకమైన అవగాహనకు వచ్చాయని ఇండియాలోని చైనా అంబాసిడార్ జు ఫీ హోంగ్ కోల్​కతాలో తెలిపారు.